Kalam Galam News
Take a fresh look at your lifestyle.

బ్యాలెట్ యూనిట్ ర్యాండమైజేషన్‌ పూర్తి.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

బ్యాలెట్ యూనిట్ ర్యాండమైజేషన్‌ పూర్తి.

తొలిజ్యోతి రాజన్నసిరిసిల్ల బ్యూరో 21, నవంబర్ 2023

సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల నిర్వహణకు జిల్లాకు అదనంగా కేటాయించిన 384 లు,బ్యాలెన్స్ బ్యాలెట్ యూనిట్ లు 384 మొత్తం 768 బ్యాలెట్‌ యూనిట్‌ల కు ర్యాండమైజేషన్‌ మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో జరిగింది.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధ్వర్యంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం కు 359 బ్యాలెట్ యూనిట్ లను , వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం కు 325 బ్యాలెట్ యూనిట్ లను కేటాయించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.