యునైటెడ్ ముస్లిం మైనార్టీ హక్కుల సంస్థ జగిత్యాల జిల్లా జనరల్ సెక్రెటరీ గా మొహమ్మద్ అన్వర్ సిద్ధికి నియామకం.
తొలిజ్యోతి
కోరుట్ల,09 డిసెంబర్ 2023, (ముహమ్మద్ సుజాయిత్ అలీ)
కోరుట్ల, పట్టణానికి చెందిన మొహమ్మద్ అన్వర్ సిద్ధికి ని యునైటెడ్ ముస్లిం మైనార్టీ హక్కుల సంస్థ జగిత్యాల జిల్లా జనరల్ సెక్రెటరీ నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ ఉత్తర్వు జారీ చెసారు. అదేవిధంగా మొహమ్మద్ బషీరుద్దీన్ ని కోరుట్ల ఉపాద్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో వరకట్నం కోసం పేద ప్రజలు అప్పులు చేసి మరీ వరకట్నం ఇస్తున్నారని అన్నారు.. వరకట్నం ఇవ్వడం గానీ అడగడం గానీ చాలా పెద్ద నేరమని, ఈ వరకట్నం పోవాలంటే యునైటెడ్ ముస్లిం మైనారిటీ హక్కుల సంస్థ ఆధ్వర్యంలో ఒక అవేర్నెస్ తీసుకువచ్చిందని అన్నారు. మైనారిటీ పేద ప్రజలు వరకట్నం తీసుకోకపోతే మా ఆర్గనైజేషన్ ద్వారా పెళ్ళికొడుకు అతని ఏ వృత్తిలో ఉన్న ఆ వృత్తికి సంబంధించిన దుకాణం గానీ మరి ఏదో గాని మా ఆర్గనైజేషన్ ద్వారా పెట్టి ఇస్తామని అన్నారు. అదేవిధంగా మహమ్మద్ అనవార్ సిద్ధికి మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న రోజుల్లో యునైటెడ్ ముస్లిం మైనారిటీ హక్కుల సంస్థ బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానని అదేవిధంగా జగిత్యాల జిల్లా మైనార్టీ ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని తెలిపారు.
జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ముస్లింలకు గత ప్రభుత్వములో చేపట్టిన పథకాలు ముస్లింలకు అందలేదని వాటిపై పోరాడుతామని మహమ్మద్ అన్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా మైనార్టీ జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్లను సైతం గత ప్రభుత్వం ఇవ్వలేదని, ఈ విషయాలన్నింటినీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మైనార్టీలకు తగు న్యాయం అందేలా కృషి చేస్తానని అన్నారు. జగిత్యాల జిల్లాలోని మైనార్టీ ముస్లిం ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఏ సమస్య వచ్చినా యునైటెడ్ ముస్లిం మైనార్టీ హక్కుల సంస్థ 24 గంటలు ఎల్లవేళలా సేవలను అందజేస్తుందని అన్నారు. ఈ ఆర్గనైజేషన్లో జగిత్యాల కోరుట్ల మెట్పల్లి మైనార్టీ ప్రజలు భారీగా చేరాలని మహమ్మద్ అన్వర్ మనవి చేశారు.