రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రారంభమైన హోమ్ ఓటింగ్.
ఎనభై ఏళ్లకు పైబడిన వృద్ధులు, 40 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 989 మందికి హోమ్ ఓటింగ్‌కు అవకాశం.
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రారంభమైన హోమ్ ఓటింగ్.
- ఎనభై ఏళ్లకు పైబడిన వృద్ధులు, 40 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయం.
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో 989 మందికి హోమ్ ఓటింగ్‌కు అవకాశం.
- జిల్లాలో ఈ నెల 21 నుంచి 25 వ తేదీ వరకు హోమ్ ఓటింగ్ కు అవకాశం.
తొలిజ్యోతి రాజన్నసిరిసిల్ల బ్యూరో, 21, నవంబర్ 2023
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో హోం ఓటింగ్ మంగళవారం ప్రారంభమైంది. జిల్లాలో ఈ నెల 25 వ తేదీ వరకు అధికారులు హోం ఓటింగ్ కు అవకాశం కల్పించారు.
ఎనభై ఏళ్లకు పైబడిన వృద్ధులు, 40 శాతం కు పైబడి వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోనీ వేములవాడ ,సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 989 మందికి ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశం వచ్చింది.
హోమ్ ఓటింగ్ కోసం సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో 5, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో 9 బృందాలను ఏర్పాటు చేశారు.
ఒక్కో బృందం లో ప్రిసైడింగ్ అధికారి,సహాయ ప్రిసైడింగ్ అధికారి, మైక్రో ఆబ్జర్వర్, పోలీస్ అధికారి, విడియో గ్రాఫర్ లు మొత్తం 5 మంది ఉంటారు. అధికారిక వాహనంలో వీరు ఇంటింటికీ ఎన్నికల సామగ్రితో వెళ్లి హోమ్ ఓటింగ్ అవకాశం కల్పిస్తారు. ఇంటి వద్ద సాధారణ పోలింగ్ కేంద్రం మాదిరి ఏర్పాటు చేస్తారు.
అధికారులు ఓటరు ఇంటికి వెళ్లి ఓ తాత్కాలిక గదిని ఏర్పాటు చేస్తారు. ఓటరు ఆ గదిలోకి వెళ్లి బ్యాలెట్ పేపర్ పైన తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలి. ఆ తర్వాత బ్యాలెట్ పేపరును చిన్న కవరు (ఫామ్ 13బీ)లో ఉంచి ఎన్నికల అధికారికి ఇవ్వాలి. ఓటు ధ్రువీకరణ పత్రం ఫామ్ 13ఏ పైన సంతకం చేయాలి. ఆ రెండు ఫామ్‌లను పెద్ద కవరులో వేసి, ఓటును సీల్ చేస్తారు.