Kalam Galam News
Take a fresh look at your lifestyle.

బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. సిరిసిల్ల లో రాజీనామాలు షురూ..

బీఆర్ఎస్ కు తంగళ్లపల్లి జడ్పీటీసీ గుడ్ బై..

తొలిజ్యోతి రాజన్న సిరిసిల్ల జిల్లా 17 డిసెంబర్ 2023.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. సిరిసిల్ల నియోజకవర్గం లోని తంగళ్ళపల్లి మండల జడ్పిటిసి సభ్యురాలు పూర్మాని మంజుల- లింగారెడ్డి దంపతులు తమ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసారు, రాజీనామా పత్రాన్ని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్యకు పంపించారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజీనామాల పర్వం మొదలందని రాజకీయపరంగా తీవ్ర చర్చ కొనసాగుతోంది. మరో వారం రోజుల్లో తన అనుచర వర్గంతో అధికార పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు విశ్వాసనీయ సమాచారం. అయితే ఈ రాజీనామా వెనుక అనేక కోణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

బీఆర్‌‌ఎస్‌‌ పార్టీ తరుపున తంగళ్లపల్లి మండలం జడ్పీటీసీగా రెండు సార్లు జడ్పీటీసీగా గెలిపొందారు. జడ్పీ చైర్‌‌ పర్సన్‌‌గా కూడా ప్రయత్నం చేసి భంగపడ్డారు. బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం పోవడం.. కాంగ్రెస్‌‌ అధికారంలోకి వచ్చిన నేపధ్యంలో తంగళ్లపల్లి జడ్పీటీసీ పూర్మాణి మంజుల బీఆర్‌‌ఎస్‌‌కు రాజీనామా చేయడం రాజకీయ చర్చకు దారి తీస్తుంది. సిరిసిల్ల బీఆర్‌‌ఎస్‌‌ నాయకులను ఖాళీ చేసి కాంగ్రెస్‌‌ లో చేర్పించుకునేందకు కాంగ్రెస్‌‌ అధినాయకత్వం ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలుస్తుంది. తనకు పార్టీలో గుర్తింపు ఇవ్వడం లేదని, పార్టీలో స్వేచ్ఛ లేదని, కొంతమంది చెప్పిందే వేదం అన్నట్లు సిరిసిల్లలో కొనసాగుతుందని దీనివల్ల కింది స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు కార్యకర్తలు కూడా ఎంతో అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.