- కుట్ర పూరితమే..
- అగ్ని ప్రమాదం కాదు..
- కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి.
తొలిజ్యోతి రాజన్నసిరిసిల్ల బ్యూరో 13 నవంబర్ 2023, సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థలో జరిగింది అగ్ని ప్రమాదం కాదని అది ముమ్మాటికి కుట్రపూరితంగానే జరిగిందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. గతంలో జరిగిన అవినీతి చిట్టా బయటపడుతుందనే అగ్ని ప్రమాద డ్రామా ఆడుతున్నారని అన్నారు. రేపో మాపో విజిలెన్స్ అధికారుల ఆడిటింగ్ నేపద్యంలో అగ్నిప్రమాదం మర్మమేమిటని ప్రశ్నించారు? కేటీఆర్..అవినీతిని ప్రోత్సహిస్తున్నాడా? లేక అందులో భాగస్వామ్యమా..? చెప్పాలని డిమాండ్ చేసారు. ఆదివారం సెస్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కార్యాలయ అవరణంలో కాల్చ వలసిన టపాకాయలు రికార్డ్ రూములో ఎలా కాల్చారని ప్రశ్నించారు.
సెస్ ఛైర్మన్, ఎండి లేకుండా దీపావళి పండుగ ఎలా జరుపుకుంటారన్నారు. రెండు దశాబ్దాల కాలంగా ఇక్కడే సెస్ అపిసులో తిష్ట వేసిన ఓ ఉద్యోగి పనేనంటు అనుమానం వ్యక్తం చేసారు. అగ్నప్రమాదం జరిగి గంట సేపు అయిన అధికారులు స్పందింకపోవడం ఏంటిని, కేటీఆర్ కు ఏమాత్రం చిత్త శుద్ది ఉన్న చైర్మన్ ను, ఎండినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.సెస్ లో జరిగిన అగ్నప్రమాద ఘటనలో కేటీఆర్ కూడా బాద్యుడేనని, కేటీఆర్ ను మూడు సార్లు గెలిపించిన పాపానికి సిరిసిల్లను మఫియాల రాజ్యం చేసిండన్నారు. ఒకరేమో భూ మాఫియా,ఒకరు, శాండ్ మాఫియా,ఒకరు చేనేత మాఫియా,ఇంకొకరు మాదక ద్రవ్యాల మాఫియా లని,
ఇంత మంది మాఫియాలను కేటీఆర్ దగ్గర పెట్టుకొని పరిపాలన సాగిస్తండని అన్నారు. మళ్ళీ కేటీఆర్ ను గెలిపిస్తే అవినీతి అనకొండలు పెరిగి అవి పెద్దవై సిరిసిల్ల ను ఆగం జేసుడు ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమం లో…