Kalam Galam News
Take a fresh look at your lifestyle.

సిరిసిల్ల పట్టణంలో దొంగ ఓటు..

చనిపోయిన వ్యక్తి ఓటును వేసిన వైనం. దొంగ ఓటు పై ప్రశ్నించిన కూతురు వీణ.. గొడవ చేయొద్దు అంటూ పోలింగ్ బూత్ దగ్గర నుంచి బయటకు పంపించారని ఆరోపణ..

  • చనిపోయిన వ్యక్తి ఓటును వేసిన వైనం.
  • దొంగ ఓటు పై ప్రశ్నించిన కూతురు వీణ..
  • గొడవ చేయొద్దు అంటూ పోలింగ్ బూత్ దగ్గర నుంచి బయటకు పంపించారని ఆరోపణ..

తొలిజ్యోతి సిరిసిల్ల టౌన్
30 నవంబర్ 2023.
సిరిసిల్ల పట్టణం లో దొంగ ఓటు వేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గం సిరిసిల్ల పట్టణం బివై నగర్ బూత్ నెంబర్ 165 లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బీవీ నగర్ కు చెందిన చిట్యాల లక్ష్మణ్ గత మూడు సంవత్సరాల క్రితమే మరణించిట్లు ఆయన కూతురు వీణ వెల్లడించింది. ఆయన మరణించినట్లు బి వై నగర్ లో అందరికీ తెలుసు అని పోలింగ్ బూత్ లో కూర్చున్న బూత్ ఏజెంట్లకు కూడా అందరికీ తెలుసని అయినప్పటికీ తమ తండ్రి ఓటు వేరే ఎవరితోనో ఎలా వేయించారని ప్రశ్నించామని వీణ తెలిపింది.

మూడు సంవత్సరాల క్రితం మరణించిన వ్యక్తి ఫోటో…

పోలింగ్ బూత్ లో గొడవ చేయొద్దు అంటూ అధికారులు పోలీసులు మమ్మల్ని బయటకు పంపించారని ఆమె ఆరోపించారు.
మేము ఓటు వేసే సమయంలో మా నాన్న ఓటు వేరే వాళ్ళు వేసిన విషయం తెలిసిందని ఇలా మాకు తెలిసింది ఒకటే కావచ్చు ఇలాంటివి సిరిసిల్ల పట్టణంలో ఇంకా ఎన్ని జరిగుంటాయంటూ అనుమానాలు వ్యక్తం చేసింది. అధికారులు బూత్ ఏజంట్ల నిర్లక్ష్య వైఖరిని ఆమె తప్పు పట్టింది.
వెంటనే మా తండ్రి ఓటు వేసిన వారిని గుర్తించాలని తగు చర్యలు తీసుకోవాలని ఆమె ఎలక్షన్ కమిషన్ను డిమాండ్ చేసింది. మా తండ్రి చనిపోయిన వెంటనే పింఛన్ కట్ చేశారని రేషన్ బియ్యం కట్ చేశారని మరి మూడు సంవత్సరాలు గడిచిన ఓటు హక్కును ఎందుకు తొలగించలేదని ఆమె ప్రశ్నించారు.బూత్ లో ఉన్న అధికారులను ప్రశ్నిస్తే పొరపాటు జరిగిందంటూ అధికారులు సమాదానం ఇచ్చారని తెలిపింది. ఎన్నికల అధికారులు వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపించాలని చిట్యాల లక్ష్మణ్ కుటుంబీకులు పట్టణ ప్రజలు కోరుతున్నారు.

చనిపోయిన వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం…

Leave A Reply

Your email address will not be published.