Kalam Galam News
Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి.

తొలిజ్యోతి ముస్తాబాద్.
06 డిసెంబర్ 2023.

ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఎళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా డా బీ అర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించ నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు మాట్లాడుతూ
అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే ఈరోజు సమాజంలో ఇంత స్వేచ్ఛగా తిరిగే వారం కాదని అన్నారు.
ప్రస్తుతం పదవులు అనుభవిస్తున్నాము అంటే అంబేద్కర్ యొక్క ఓటు హక్కు అనే ఆలొచన విధానం వల్లనే అన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లేకుంటే ఎన్నో అణచివేతలకు గురయ్యే వారమన్నారు. కాంగ్రెస్ పార్టీ వారి ఆశయాలను నెరవేరుస్తూ వారు చూపిన మార్గంలో నడుస్తామాన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు తలారి నర్సింలు, బీసీ సెల్ అధ్యక్షులు శీల ప్రశాంత్, ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తాళ్ళ విజయ్ రెడ్డి, సోషల్ మీడియా మండల ఇన్చార్జ్ ఎదునూరి భానుచందర్, సీనియర్ నాయకులు వేలుముల రాంరెడ్డి, దీటి నర్సింలు, మాధసు అనిల్, ఉచ్చిడి బాల్ రెడ్డి, అన్నం శ్రీధర్, రెడ్డి, సారుగు రాకేష్, సద్ది మధు, మిడిదొడ్డి భాను, అంబేద్కర్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.