కోనరావుపేట
తొలిజ్యోతి 15 జనవరి 2024.
(ఎర్రవెల్లి నరేష్)
బావిలో పడి విద్యుత్ శాఖలో పనిచేసే అసిస్టెంట్ హెల్పర్ మృతిచెందిన ఘటన
కోనరావుపేట మండలంలోని కొలనూరు గ్రామంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెలితే కొలనూర్ గ్రామానికి చెందిన శ్రీరాముల రాజేశం (55)
గ్రామంలో అస్టెంట్ హెల్పర్ గా ,హెల్పర్ గా విధులు నిర్వహించాడని,ప్రస్తుతం సిరిసిల్ల ఒకటవ పట్టణ పరిదిలో విధులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
ఇతనికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు, ఉన్నాట్లు గ్రామస్థులు తెలిపారు. సంఘటన స్థలానికి కోనరావుపేట ఎస్సై ఆంజనేయులు చేరుకొని కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.