Kalam Galam News
Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దీప్తి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం..

కోరుట్ల భార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బైరి విజయ్.

తొలిజ్యోతి కోరుట్ల 04 డిసెంబర్ 2023, (మహమ్మద్ సుజాయిత్ అలీ)

కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే విద్యావంతులు ప్రముఖ వైద్యులుగా విశిష్ట సేవలందించి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి కోరుట్ల నియోజకవర్గ ప్రజలందరి ఆధార అభిమానాలు అందుకొని మొదటి ప్రయత్నంలోనే శాసన సభ్యులుగా ఎన్నికైన. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ దీప్తి ల పెళ్లి రోజు సందర్భంగా మరో శబరిమలై గా పేరొందిన కోరుట్ల అయ్యప్పస్వామి దేవాలయంలో సుమారు 600 మందికి పైగా అయ్యప్ప స్వాములకు కోరుట్ల భార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బైరి విజయ్ ఆద్వర్యంలో బిక్షా ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దీప్తి ల పెళ్లి రోజు సందర్భంగా కల్వకుంట్ల సంజయ్ పై అభిమానం తో వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి కోరుట్ల నియోజక వర్గ ప్రజలకు సేవ చేయాలని అట్టి ప్రయత్నం లో భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుట్ల ప్రజలకు విద్యావంతులు అయిన కల్వకుంట్ల సంజయ్ ఎమ్మెల్యే గా గెలవడం ఎంతో హర్షించదగిన విషయం అని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో అడ్వకేట్ గండ్ర ప్రవీణ్ రావు,అయ్యప్ప దేవాలయం శాశ్వత గౌరవాధ్యక్షులు చిద్రల నారాయణ గురు స్వామి, గండ్ర రాజేంద్ర రావు గురు స్వామి, దుబాయ్ శ్రీనివాస్ల స్వామి,నీలి శ్రీనివాస్ స్వామి, శ్రీపతి రమేష్ స్వామి, గ్యాద సాయి స్వామి,క్యాతం ప్రసాద్ స్వామి, మరియు అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.