తొలిజ్యోతి కోరుట్ల 08 డిసెంబర్ 2023. (మహమ్మద్ సుజాయిత్ అలీ)
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 69వ జాతీయ మహాసభలు ఢిల్లీలో నిర్వహించారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈమేరకు కోరుట్ల పట్టణానికి చెందిన మాడవేణి సునీల్ ను తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమాకం చేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు జానారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ విద్యార్థులందరినీ దేశభక్తి వైపు జాతీయత భావం వైపు నడిపిస్తానని, అదేవిధంగా విద్యారంగ సమస్యలపై పరిష్కారం దిశగా ఉద్యమిస్తానని తెలిపారు. తన నియమకానికి సహకరించిన రాష్ట్ర శాఖకు ధన్యవాదాలు తెలిపారు.